News December 18, 2025
జాతర ఏర్పాట్ల ప్రతిపాదనలు సమర్పించాలి: పెద్దపల్లి కలెక్టర్

సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల ప్రతిపాదనలు డిసెంబర్ 22లోగా సమర్పించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతర నిర్వహణపై సంబంధిత అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. పంచాయతీ రోడ్ల మరమ్మతులు, క్యూలైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా తదితర అంశాలు డిసెంబరు 22లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. స్టాండ్ బై ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News December 19, 2025
KNR: వరుసగా చెక్ డ్యాంల ధ్వంసం.. చర్యలేవీ..?

చెక్ డ్యాంలను ఇసుక మాఫియా ధ్వంసం చేస్తుందా లేక నీటి ప్రవాహానికి కూలుతున్నాయా అనే విషయాన్ని అధికారులు తేల్చకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మాఫియా బ్లాస్ట్ చేశాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా ప్రభుత్వం విచారణ పేరుతో జాప్యం చేస్తుందన్న విమర్శలొస్తున్నాయి. నిన్న అడవిసోమన్పల్లి, ఇటీవల గుంపుల చెక్ డ్యాం కూలిన ఘటనలు రాజకీయ దుమారం రేపుతున్నా ఇసుక అక్రమ రవాణా కట్టడిపై చర్యలు లేకపోవడం గమనార్హం.
News December 19, 2025
వరంగల్ జిల్లాలో సాగు వివరాలు..!

జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభమైంది. 2025-26 యాసంగి పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యతపై కలెక్టర్
సత్య శారద సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మొక్కజొన్న 26,510 ఎకరాలు, కూరగాయలు తదితర ఉద్యాన పంటలు 6,877 ఎకరాల్లో సాగవుతున్నాయి. వరి పంట 1,15,200 ఎకరాల సాగు అంచనాతో 23,040 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్న 1,08,500 ఎకరాల అంచనాకు 8,680 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి.
News December 19, 2025
కడప జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులకు గమనిక

కడప జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులు(సివిల్) శిక్షణకు హాజరు కావాలని SP విశ్వనాథ్ ఆదేశించారు. ‘పురుషులకు తిరుపతి కళ్యాణి డ్యాం, మహిళలకు ఒంగోలు PTCలో ఈనెల 21 నుంచి ట్రైనింగ్ ఉంటుంది. ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, SBI పాస్‌బుక్ జిరాక్స్, రూ.10వేల కాషన్ డిపాజిట్, పోలీస్ డిపార్ట్‌మెంట్ సర్వీస్ బుక్, 6స్టాంప్ సైజ్ ఫోటోలు, రూ.100 అగ్రిమెంట్ బాండ్‌తో ఎస్పీ ఆఫీసుకు 21వ తేదీ రావాలి’ అని SP చెప్పారు.


