News June 29, 2024
జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు కర్నూల్ యువకుడు

జులై మూడో వారంలో విజయవాడలో జరగనున్న జాతీయ స్థాయి అండర్-10 ఆర్చరీ పోటీలకు కర్నూల్ నగరానికి చెందిన యువకుడు కె.పార్థ చంద్ర ఎంపికైనట్లు జిల్లా ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి నాగరత్నమయ్య తెలిపారు. పార్థ చంద్ర ఈ నెల 22 నుంచి 24 వరకు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో 9వ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని వివరించారు.
Similar News
News October 4, 2025
ఎస్సీ,ఎస్టీ కేసుల బాధితులకు పరిహారం అందించండి: కలెక్టర్

ఎస్సీ,ఎస్టీ కేసులు బాధితులకు పరిహారం అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాధితులకు పరిహారం అందించాలన్నారు.
News October 3, 2025
జిల్లా అభివృద్ధికి నిధులు విడుదల: కలెక్టర్

జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ ద్వారా నిధులు విడుదలైనట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. చిప్పగిరి ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో అంగన్వాడీల అభివృద్ధికి రూ.35 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.95 లక్షలు, పాఠశాలల అభివృద్ధికి రూ.20 లక్షలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. నిర్దేశించిన కాల వ్యవధిలో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
News October 3, 2025
ఈనెల 16న మోదీ పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

ఈనెల 16న ప్రధాని మోదీ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మోదీ పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్, వేదిక, వసతి, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.