News January 28, 2025
జాతీయస్థాయి పోటీలకు జైపూర్ విద్యార్థిని

జైపూర్ మండలం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని సంజన జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. పాఠశాల HM శ్యాంసుందర్, PDగోపాల్ మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాలికల క్రికెట్ పోటీల్లో సంజన అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. జాతీయస్థాయి పోటీలు ఫిబ్రవరి 3నుంచి 9వరకు హరియాణాలో జరుగుతాయన్నారు.
Similar News
News November 6, 2025
ధాన్యం నిల్వలో తేమ శాతం ముఖ్యం

ధాన్యాన్ని నిల్వచేసేటప్పుడు తేమ 14% కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. గింజలలో తేమ శాతం తక్కువగా ఉంటే ధాన్యం రంగు మారదు, బూజు పట్టదు, కీటకాలు ఆశించవు. ధాన్యంలో తేమ 14%కు మించినప్పుడు, నిల్వ చేసే పద్ధతి సరిగా లేనప్పుడు ధాన్యానికి కీటకాలు, తెగుళ్లు ఆశించి నష్టం జరుగుతుంది. అందుకే ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసేప్పుడు మధ్యలో అప్పుడప్పుడు చీడపీడలను పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
News November 6, 2025
ధాన్యం సేకరణ సందేహాలపై కంట్రోల్ రూమ్: కలెక్టర్

ఖరీఫ్ సీజన్‌లో వరి సేకరణ 4 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు రైతుల నుంచి మొత్తం15.64 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు సంయుక్త కలెక్టర్ వై. మేఘ స్వరూప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలుపై సందేహాలకు, ఫిర్యాదులకు కలెక్టర్ కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్ నంబర్ 83094 87151కు సంప్రదించవచ్చన్నారు.
News November 6, 2025
భూమాతను ఎందుకు దర్శించుకోవాలి?

భూమాత మనకు ఆశ్రయమిస్తుంది. మన అవసరాల కోసం ఎన్నో వనరులనిస్తుంది. అందుకే మనం ఆమెను తల్లిలా కొలుస్తాం. అన్నం పెట్టే అన్నపూర్ణలా కీర్తిస్తాం. అలాంటి త్యాగమూర్తికి కృతజ్ఞత తెలపడం, ఆ తల్లిపై పాదాలు మోపుతున్నందుకు క్షమాపణ కోరడం మన బాధ్యత. అందుకే భూదేవిని నమస్కరించాలి. ఉదయం లేవగానే పాదాలను నెమ్మదిగా నేలను తాకించడం వలన భూమిలోని సానుకూల శక్తి మెళ్లిగా మనలోకి ప్రవేశించి, ఆరోజంతా హ్యాపీగా ఉండేలా చేస్తుంది.


