News March 14, 2025

జాతీయస్థాయి పోటీలకు మంచిర్యాల క్రీడాకారిణి

image

మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకట జనని జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రవి, శివమహేశ్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. జననిని అసోసియేషన్ సభ్యులు, తదితరులు అభినందించారు.

Similar News

News February 25, 2026

కొత్త పెన్షన్లపై శుభవార్త

image

AP: కొత్త పింఛన్లపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చిలో 8,977 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మార్చి 1న సండే కావడంతో FEB 28నే పెన్షన్లు <<19230790>>అందజేయనున్నట్లు<<>> ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62.76L మందికి ₹2,725Crను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. వృద్ధులు, వితంతువులకు ₹4K, దివ్యాంగులకు ₹6K, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ₹10K, మంచానికే పరిమితమైన వారికి ₹15K ఇస్తున్న విషయం తెలిసిందే.

News February 25, 2026

నల్గొండ: అంగన్‌వాడీలపై ‘సర్పంచ్’ పెత్తనమేంటి?

image

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను సర్పంచులకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ జోక్యం పెరిగి, చిన్న కారణాలతో కార్యకర్తలు వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ వర్గపోరు వల్ల కేంద్రాల పనితీరు దెబ్బతింటుందని, ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలోనే సేవలు సక్రమంగా అందుతున్నాయని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి.

News February 25, 2026

చైనా అండతో USను టార్గెట్ చేసిన ఇరాన్!

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇప్పటికే అమెరికా యుద్ధనౌకలు ఆ దేశ తీరానికి సమీపంలో మోహరించాయి. దీనికి కౌంటర్‌గా ఇరాన్.. చైనా నుంచి సూపర్ సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను కొనుగోలు చేయనుంది. ఇప్పటికే డీల్ దాదాపు పూర్తి కావొచ్చిందని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. వీటితో 290 కి.మీ దూరంలోని లక్ష్యాలను అటాక్ చేయవచ్చు. వాటిని అడ్డుకోవడం చాలా కష్టం.