News October 4, 2024
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు నరసన్నపేట విద్యార్థి

జాతీయస్థాయిలో ఢిల్లీలో జరగనున్న ఫుట్‌బాల్ పోటీలకు నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని పుష్పలత ఎంపికైందని ప్రిన్సిపల్ పి లత, పిఈటీ భోగేశ్ గురువారం తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ఆమె గెలుపొందిందని వివరించారు. ఢిల్లీ నోయిడా లో ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటుందన్నారు.
Similar News
News February 13, 2026
రేపు శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు లేదు: DEO

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయనున్నాయని DEO రవిబాబు శుక్రవారం తెలిపారు. వాస్తవానికి రేపు రెండో శనివారం అయినప్పటికీ గత ఏడాది తుఫాన్ సందర్భంగా సెలవుల అనంతరం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు పాఠశాలలకు పనిదినాలు ఉండనున్నాయని తెలిపారు. పాఠశాలల పనిదినాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రేపు సెలవు రద్దు చేయడం జరిగిందన్నారు.
News February 13, 2026
శ్రీకాకుళం: నేడు ప్రపంచ రేడియో దినోత్సవం

ఆకాశవాణి.. అంటూ గగనతలం నుంచి సాగిన అదృశ్యవాణి ఒక తరానికి తీరని జ్ఞాపకం. టీవీలు, సెల్ ఫోన్లు రాకముందు రేడియో ఒక అద్భుతమైన స్నేహితుడు. పాటలు, కథలు, న్యూస్, వినోదం ఇలా ఎన్నో రకాల సేవలు అందించే ఈ రేడియో నేటి తరానికి తెలియదు. సమాచార విప్లవం తర్వాత కూడా ఎఫ్.ఎమ్ అంటూ సందడి చేసింది. నేడు ప్రపంచ రేడియో దినోత్సవం.
News February 13, 2026
మందస: రాజవంశీయుడు కన్నుమూత

మందస రాజవంశీయులు కేసరి సింగ్ దేవ్ (79) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లోని ఖార్వేలా నగర్‌లో స్వగృహంలో కన్నుమూశారు. కేసరి సింగ్ దేవ్ గతంలో టెరిటోరియల్ ఆర్మీలో అధికారిగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు. ఈయన మృతితో మందసలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సంస్థానానికి చివరి రాజు అయిన రాజమణి రాజ్ దేవ్ ద్వితీయ కుమారుడే కేసరి సింగ్ దేవ్.


