News December 26, 2025
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థి

ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రస్థాయిలో బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థి సిహెచ్ వివేక్ చిన్నతనం నుంచి బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టంగా అకాడమీలో ఉంటూ మంచి శిక్షణ పొందారు. ఎల్లారెడ్డి గురుకుల పాఠశాల పేరు జాతీయస్థాయిలో నిలిపారని కొనియాడారు.
Similar News
News December 27, 2025
ఇరిగేషన్ శాఖ సలహాదారుపై BRS గురి!

TG: అసెంబ్లీలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు ముందు ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌పై BRS గురిపెట్టింది. 2014-19 మధ్య CBN పాలనలో AP నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన ఈ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసి పనులను నిలిపివేశారని BRS ఆరోపిస్తోంది. దీంతో కౌంటర్ ఇచ్చేందుకు CM రేవంత్, మంత్రి ఉత్తమ్ సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టును నిలిపివేయడంలో ఆదిత్యనాథ్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
News December 27, 2025
కరీంనగర్: పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన లెప్రసీ, పల్స్ పోలియో బిల్లులను చెల్లించాలని శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆశావర్కర్లు ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ.. ఈ బిల్లులపై డీఎంహెచ్‌ఓ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించే వరకు పోరాడుతామన్నారు.
News December 27, 2025
మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎస్పీ

మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. జాతర పనులను పూర్తి చేసి సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు


