News August 27, 2025

జాతీయ అవార్డుకు ఎంపికైన జనగామ కవయిత్రి

image

తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఈనెల 31న ఆంధ్రప్రదేశ్ పల్నాడులో తెలుగు తేజం జాతీయ పురస్కారాలు అందజేయనున్నారు. ఈ క్రమంలో జనగామకు చెందిన ప్రముఖ కవయిత్రి బుదారపు లావణ్య ఎంపికైనట్లు నిర్వాహక సంస్థ అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక నిర్వహకులు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు కవులు కవయిత్రులను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.

Similar News

News August 27, 2025

KNR: మాజీ MLA రవిశంకర్‌కు బెదిరింపు కాల్..!

image

KNR(D) చొప్పదండి మాజీ MLA సుంకే రవిశంకర్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దీనిపై ఆయన మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ నంబర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ‘ప్రెస్ మీట్ పెట్టి సత్యం అన్న(MLA మేడిపల్లి సత్యం)ను తిడితే నిన్ను బతకనివ్వను.. చంపేస్తా’ అంటూ బెదిరించాడని సుంకే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ సర్పంచులు, నాయకులు ఉన్నారు.

News August 27, 2025

సిద్దిపేట: చరిత్రలో చీకటి రోజు.. 84 మంది మృతి

image

తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న బైరాన్‌పల్లికి చరిత్రలో ఒక రక్తపు పేజీ ఉంది.. పూర్వపు WGL మద్దూరు(M)లోని ఈ గ్రామం 1948 ఆగస్టు 27న రజాకార్ల క్రూరత్వానికి వేదికైంది. గ్రామస్థుల పోరాట పటిమ చూసి భయపడిన రజాకార్లు ప్రతీకారంతో గ్రామంపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నిజాం సైన్యం 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ఈ ఊచకోత తెలంగాణ చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా మిగిలింది.

News August 27, 2025

గుంటూరులో బార్ షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు

image

గుంటూరు జిల్లాలో బార్ షాపుల కేటాయింపుకు సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు సాయంత్రం 6 గంటల లోపు ఆసక్తిగల వారు అప్లై చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ డీసీ కె.శ్రీనివాసులు మంగళవారం వెల్లడించారు. అనంతరం 30న కలెక్టర్ కార్యాలయంలో లాటరీ నిర్వహించి మొత్తం 110 షాపుల కేటాయింపును పూర్తిచేయనున్నట్లు తెలిపారు.