News September 2, 2025
జాతీయ అవార్డుకు మంచిలి ఉపాధ్యాయుడు ఎంపిక

మంచిలి జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నేలపాటి వెంకటరమణ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. విద్యారంగంలో ఆయన చేసిన విశేష కృషికిగాను న్యూఢిల్లీకి చెందిన గ్లోబల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 16న న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి సెమినార్‌లో వెంకటరమణకు ఎన్‌టీఈఈ అవార్డును అందజేయనున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
Similar News
News September 3, 2025
ఉల్లి రైతులను ఆదుకోవాలి: జేసీ

జిల్లాలోని వివిధ విద్యాసంస్థలు, వసతి గృహాల వంటకాలలో కర్నూలు ఉల్లి వినియోగించి కష్టకాలంలో ఉన్న ఉల్లి రైతులను ఆదుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. భీమవరం జిల్లా కలెక్టరేట్లో మంగళవారం కర్నూలు ఉల్లి వినియోగంపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. కర్నూలు, నంద్యాల ఉల్లిపాయలు అకాల వర్షాలు కారణంగా దెబ్బతిన్నాయని అన్నారు.
News September 3, 2025
పెనుమంట్ర: ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన గీతాబాయి

పెనుమంట్ర మండలం ఆలమూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యశాఖ అధికారిణి డాక్టర్ గీతాబాయి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి, అనంతరం ఆశా వర్కర్లతో సమావేశమయ్యారు. రోగులకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని ఆమె అధికారులను ఆదేశించారు.
News September 2, 2025
నేత్రదానంపై అవగాహన పెంచాలి: కలెక్టర్ నాగరాణి

జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని, ఇది ఒక గొప్ప దానమని ఆమె పేర్కొన్నారు.