News September 22, 2025
జాతీయ అవార్డు పొందిన సమీరా

తుగ్గలి మండలంలోని గుండాల తండాకు చెందిన ట్రాన్స్‌జెండర్ సమీరా చెక్కభజన కళారంగంలో ప్రతిభ కనబరిచి జాతీయ అవార్డు పొందారు. ఆదివారం ఢిల్లీలో హర్యానా ఆర్థిక మంత్రి రాఘవేంద్రరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ గౌరవం ఎంతో సంతోషం కలిగించిందని సమీరా తెలిపారు. ప్రజలు అభినందనలు తెలిపారు.
Similar News
News September 22, 2025
ఆలూరు టీడీపీ నూతన ఇన్‌ఛార్జ్‌గా వైకుంఠం జ్యోతి

ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వైకుంఠం జ్యోతి ఎన్నికైనట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ అధికారంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వైకుంఠపు జ్యోతి మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలు తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, పల్లా శ్రీనివాస్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
News September 22, 2025
ఆలూరు టీడీపీ నూతన ఇన్‌ఛార్జ్‌గా వైకుంఠం జ్యోతి

ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వైకుంఠం జ్యోతి ఎన్నికైనట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పల్లా శ్రీనివాస్ అధికారంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వైకుంఠపు జ్యోతి మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలు తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, పల్లా శ్రీనివాస్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
News September 22, 2025
కర్నూలు జిల్లా ఎస్పీ పబ్లిక్ గ్రీవెన్స్‌లో 65 ఫిర్యాదులు

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 65 ఫిర్యాదులు స్వీకరించి ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ నేరుగా విని పరిష్కార చర్యలకు ఆదేశించారు. మోసాలు, ఉద్యోగ మభ్యపాటు, అప్పుల వేధింపులు, స్కూల్‌లో ఘర్షణలు, భూ ఆక్రమణలు, పొదుపు గ్రూపుల మోసాలు వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. అన్ని ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు.