News February 8, 2025

జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి జిల్లా వాసి

image

కామారెడ్డి జిల్లా రక్త దాతల సమూహ అధ్యక్షుడు జమీల్ సాయి సేవ భగవాన్ జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికైనట్లు రక్త దాతల ఫౌండర్ డా.బాలు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి గుంటూరు జిల్లా చిలకలూరిపేట జయ జయ సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం చిలకలూరిపేటలో ఈ పురస్కారాన్ని జమీల్ అందుకొనున్నారు.

Similar News

News February 8, 2025

10 నుంచి బోదకాలపై స్పెషల్ డ్రైవ్

image

ఫైలిరియాసిస్(బోదకాలు) నివారణకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10న స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది. ఏపీ సహా 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో 2 వారాలపాటు కొనసాగనుంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటికే వచ్చి ఉచితంగా ఔషధాలు అందిస్తారని, తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. క్యూలెక్స్ దోమల కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనివల్ల కాళ్లతోపాటు ఇతర శరీర భాగాలు విపరీతంగా వాపునకు గురవుతాయి.

News February 8, 2025

మాజీ మంత్రి రజినీపై అట్రాసిటీ కేసు

image

AP: మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. 2019లో సోషల్ మీడియాలో రజినీపై పోస్టు పెట్టినందుకు తనను సీఐ సూర్యనారాయణ ద్వారా హింసించారని పిల్లి కోటి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో రజినీ, ఆమె పీఏలతోపాటు అప్పటి సీఐపై కేసు నమోదైంది.

News February 8, 2025

SSMB29లో నానా పటేకర్?

image

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో SSMB29 మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్‌ను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అటవీ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచరస్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

error: Content is protected !!