News August 28, 2025
జాతీయ క్రీడా దినోత్సవ రన్‌ను ప్రారంభించిన కలెక్టర్

క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకొని రాణించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆమె మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి కలెక్టర్ నుంచి మేకల అభినవ్ స్టేడియం వరకు నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
Similar News
News August 28, 2025
పాఠశాలల బలోపేతానికి చర్యలు: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం తన కార్యాలయంలో డీఈవో బిక్షపతి, జిల్లా సెక్టోరియల్ అధికారులు, ఎంఈవోలతో ఆమె విద్యా విషయక సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న పుస్తకాలు, యూనిఫాంలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై ఆమె సమీక్షించారు. విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News August 28, 2025
సురక్ష బీమా యోజన నమోదు చేయించాలి: శేఖర్ రెడ్డి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరినీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై)లో నమోదు చేయించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి ఆదేశించారు. ఉపాధి సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద నమోదైన వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News August 28, 2025
దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ విషయమై గురువారం ఆమె ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 2017 నుంచి ఇప్పటి వరకు 33,600 మరణాలు సంభవించినప్పటికీ, ఈ పథకం కింద కేవలం 3,121 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని కలెక్టర్ అన్నారు. దరఖాస్తుల సంఖ్య మరింత పెరగాలని ఆమె సూచించారు.