News March 29, 2024

జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు అమూల్య

image

బిహార్ రాష్ట్రం పాట్నాలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్న 33వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా నుంచి చింతరాల అమూల్య రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్టు కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అమూల్య ఎంపికకు సహకరించిన అంతర్జాతీయ క్రీడాకారుడు మహేందర్ రెడ్డికి, జై హనుమాన్ స్పోర్ట్స్ క్లబ్ సీనియర్ కబడ్డీ క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Similar News

News April 21, 2025

NLG: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 58,228 మంది (మొదటి సంవత్సరంలో 28,840 మంది, రెండవ సంవత్సరంలో 29,338 మంది) విద్యార్థుల భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

News April 21, 2025

NLG: డిజిటల్ ఫీడ్ బ్యాక్‌కు కానరాని స్పందన

image

ఠాణాలకు వచ్చే పౌరులతో పోలీసుల వ్యవహారశైలి, వారందించే సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం సీఐడీ రూపొందించిన ‘క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను అమల్లోకి తెచ్చినా ప్రజల నుంచి స్పందన కానరావడం లేదు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లకు వచ్చే వారికి క్యూఆర్ కోడ్ పట్ల అవగాహన కల్పించకపోవడం వలన ఇది నిరుపయోగంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.

News April 21, 2025

NLG: 22 నుంచి మరోసారి ఇందిరమ్మ ఇళ్ల సర్వే..!

image

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం రెండో విడత సర్వేకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల మొదటి విడత సర్వే పూర్తి చేసిన అధికారులు (ఎల్-1, ఎల్-2, ఎల్-3) కేటగిరీలుగా విభజించారు. ఎల్-1 కేటగిరీ వారికి మొదట ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఎల్-1 కేటగిరీలో ఎక్కువ మంది ఉండడంతో వారిలో నిజమైన అర్హులను గుర్తించేందుకు రెండో విడత సర్వే ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది.

error: Content is protected !!