News January 26, 2025
జాతీయ జెండాను ఆవిష్కరించిన భూపాలపల్లి కలెక్టర్

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డా.బీఆర్ అంబేడ్కర్ క్రీడా ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఎస్పీ కిరణ్ ఖరే, ట్రేడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ తదితరులున్నారు.
Similar News
News November 22, 2025
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆప్ డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. 48 మంది నుంచి 66 నామినేషన్లు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్లు స్వీకరించినట్లు చెప్పారు. శనివారం 12 మంది అభ్యర్ధులు 14 సెట్ల నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News November 22, 2025
వెయిట్ లిఫ్టర్లను అభినందించిన కలెక్టర్

ఈ నెల 14 నుంచి 16 వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, సీనియర్ ఉమెన్, మెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కర్నూలు లిఫ్టర్లు పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టర్లు వీరేశ్, ముషరాఫ్, పర్వేజ్, చాంద్ బాషా, హజరత్ వలిని కలెక్టర్ డా.సిరి శనివారం అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి వెయిట్ పోటీల్లోనూ ఇదే ప్రతిభ కనబరచాలన్నారు. కోచ్ యూసుఫ్ పాల్గొన్నారు.
News November 22, 2025
బీసీలను ప్రభుత్వం నట్టేట ముంచింది: R.కృష్ణయ్య

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరికి ప్రభుత్వం నట్టేట ముంచిందని ఎంపీ R.కృష్ణయ్య మండిపడ్డారు. రిజర్వేషన్లపై సర్కార్ ఇవాళ జారీ చేసిన జీవో 46ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగా ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయకుండా, గదుల్లో కూర్చొని నివేదికలు సిద్ధం చేయడం బీసీలను రాజకీయంగా దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు.


