News August 15, 2025
జాతీయ జెండా ఎగరవేసిన వరంగల్ కలెక్టర్

79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం జాతీయ పతాకావిష్కరణ చేశారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు కలెక్టర్ స్వతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.
Similar News
News August 15, 2025
కృష్ణా: ఫ్రీ బస్సు.. మహిళలు అధిపత్యం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 13 ఆర్టీసీ బస్సు డిపోలలో 1,216 బస్సులు నడుస్తున్నాయి. ప్రతి రోజుకు సగటున 2,30,200 మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తున్నారు. అందులో 1.08 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తుండగా నెలకు 32.4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రయాణికుల్లో పురుషులు 60%, మహిళలు 40% ఉండగా, ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల మహిళల శాతం 67%కు పెరగనుంది.
News August 15, 2025
గుంటూరు జిల్లాలో ఫ్రీ బస్సు.. 302 బస్సులు కేటాయింపు

రాష్ట్ర వ్యాప్తంగా నేడు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం కానుంది. అయితే గుంటూరు జిల్లా పరిధిలోని 5 డిపోల్లో 302 బస్సులను స్త్రీ శక్తి పథకానికి కేటాయించినట్లు ఇన్‌ఛార్జ్ RM సామ్రాజ్యం చెప్పారు. ఫ్రీ బస్సు పథకానికి 302 బస్సుల్లో కేటాయించగా వాటిలో 241 పల్లె వెలుగు, 8 అల్ట్రా పల్లె వెలుగు, 53 ఎక్స్‌ప్రెస్ బస్సులను మహిళలకు అందుబాటులో ఉంచామని ఆమె వెల్లడించారు.
News August 15, 2025
జగిత్యాల జిల్లా BJP కార్యవర్గం ఎన్నిక

జగిత్యాల జిల్లా బీజేపీ కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడి సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గురువారం ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా కృష్ణ హరి, పెద్ద గంగారం, లక్ష్మి, తుకారం గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, అశోక్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసన్, శీను, తిరుపతి, కార్యదర్శులుగా లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి, లవన్, కళావతి, పీసు రాజేందర్, రమేష్, కోశాధికారిగా దశరథ రెడ్డితో పాటు తదితరులను ఎన్నుకున్నారు.