News April 22, 2025

జాతీయ పోటీలకు ఎంపికైన ధర్మారం మండల విద్యార్థిని

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని దొంగతుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని రేవెల్లి శిరీష జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 25వ తేదీ నుంచి మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరపున ఆమె పాల్గొననుంది. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు శిరీషను అభినందిస్తున్నారు.

Similar News

News April 22, 2025

ఇంటర్ ఫలితాల్లో గొల్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

image

గొల్లపల్లి మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో శ్రీజ 989, హన్సిక 988, వైష్ణవి 978, మయూరి 961, స్ఫూర్తి 942, పల్లవి 935 మార్కులతో మెరిశారు. ప్రథమ సంవత్సరంలో వైష్ణవి MPC 464, శివాని 463, మయూరి BiPC 412, అభిసారిక 385, జ్యోతిక CEC 434, వైష్ణవి 432 మార్కులు సాధించారని ప్రిన్సిపల్ సుంకర రవి వివరాలు వెల్లడించారు.

News April 22, 2025

HYD: మన జిల్లాలకు వచ్చిన ర్యాంకుల వివరాలు

image

ఇంటర్ ఫస్టియర్‌లో..
మేడ్చల్ 77.21 శాతంతో స్టేట్ 1వ ర్యాంక్
రంగారెడ్డి 76.36 శాతంతో స్టేట్ 2వ ర్యాంక్
హైదరాబాద్‌ 66.68 స్టేట్ 7వ ర్యాంక్
వికారాబాద్ 61.31 స్టేట్ 12వ ర్యాంక్
ఇంటర్ సెకండియర్‌లో..
మేడ్చల్ 77.91 శాతంతో స్టేట్ 3వ ర్యాంక్
రంగారెడ్డి 77.53 శాతంతో స్టేట్ 4వ ర్యాంక్
వికారాబాద్ 68.20 స్టేట్ 21వ ర్యాంక్
హైదరాబాద్‌ 67.74 స్టేట్ 23వ ర్యాంక్

News April 22, 2025

హద్దుమీరాను.. బ్రాహ్మణులంతా క్షమించాలి: అనురాగ్ కశ్యప్

image

ఆవేశంలో హద్దు దాటి ప్రవర్తించానని, బ్రాహ్మణులందరూ తనను క్షమించాలని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కోరారు. ఫూలే సినిమాకు సంబంధించి ఓ నెటిజన్‌తో వాగ్వాదంలో ‘బ్రాహ్మణులపై మూత్రం పోస్తాను. నీకేమైనా సమస్యా?’ అని ప్రశ్నించారు. ఆగ్రహంలో అలా నోరు జారానని తాజాగా వివరణ ఇచ్చారు. ‘నా జీవితంలో ఉన్న ఎంతోమంది బ్రాహ్మణులు నా వ్యాఖ్యల పట్ల బాధపడుతున్నారు. బ్రాహ్మణులందర్నీ అనడం నా ఉద్దేశం కాదు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!