News January 8, 2026

జాతీయ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడా కారులు

image

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ నెల 8 నుంచి 10 వరకు జరగనున్న సీనియర్ జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు కృష్ణా జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. జిల్లా నుంచి హనీత్ నాగ్, శరన్ హేమంత్, సురేఖ ఊసల ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు కార్యదర్శి విజయ్ గోగులముడి తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి బయలుదేరిన క్రీడాకారులను పలువురు సీనియర్లు అభినందించి, విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Similar News

News February 7, 2026

సిద్దిపేట: పురపోరు.. సామాజిక ఓట్లపై పార్టీల గురి!

image

జిల్లాలో జరుగుతున్న గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన మార్గాల్లో కీలకమైన సామాజిక వర్గాల ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. సామాజిక వర్గాల పెద్దల దగ్గరకు వెళ్లి సంప్రదింపులు జరుపుతున్నారు. గెలిస్తే సంఘాలకు, భవనాలకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

News February 7, 2026

‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ వెనుక అర్థం ఇదేనా?

image

USను ఇరుకున పెట్టి టారిఫ్‌లను తగ్గించే వ్యూహంలో భాగంగానే EUతో భారత్ FTAపై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. 50% సుంకాలు విధించి, ఇంకా పెంచుతామని ట్రంప్ పదే పదే హెచ్చరించి మనకు మంచే చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. అలా చేయకుంటే ప్రత్యామ్నాయాలకు IND ప్రయత్నించేది కాదని అభిప్రాయపడుతున్నారు. EU ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా ప్రధాని మోదీ సంబోధించడం వెనుక ఇంత కథ ఉందా అని SMలో కామెంట్లు వస్తున్నాయి.

News February 7, 2026

‘గీతం భూముల వ్యవహారంలో బాధ్యులపై చర్యలకు డిమాండ్’

image

వైసీసీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, వరుదు కళ్యాణి, విశాఖ మాజీ మేయర్ గొలగాని హరికుమారి తాడేపల్లిలో మాట్లాడుతూ గీతం సంస్థల ఆధీనంలోని 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి రెగ్యులరైజేషన్‌ను జీవీఎంసీ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారని ఆరోపించారు. ఈ నిర్ణయంపై బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు.