News January 8, 2026
జాతీయ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడా కారులు

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ నెల 8 నుంచి 10 వరకు జరగనున్న సీనియర్ జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు కృష్ణా జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. జిల్లా నుంచి హనీత్ నాగ్, శరన్ హేమంత్, సురేఖ ఊసల ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు కార్యదర్శి విజయ్ గోగులముడి తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి బయలుదేరిన క్రీడాకారులను పలువురు సీనియర్లు అభినందించి, విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News February 21, 2026
శ్రీకాకుళం: మహిళ పొట్ట నుంచి 3.3 కిలోల కణితి తొలగింపు

కడుపు నొప్పితో బాధపడుతూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి శనివారం వచ్చింది. పరీక్షించిన వైద్యులు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం శస్త్ర చికిత్స చేసి 3.3 కిలోల కణితిని ఆ మహిళ పొట్ట నుంచి బయటకు తీశారు. పేషంట్ పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారని, అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేశామన్నారు.
News February 21, 2026
జగిత్యాల: ఉపాధ్యాయుల సర్వీసు వివరాల పరిశీలన

జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 26 నుంచి 28 వరకు, అలాగే మార్చి 2న సర్వీసు వివరాల పరిశీలన నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. జగిత్యాల (అర్బన్) ఎంఆర్సీలో ఈ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులు తమ ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్, ధ్రువపత్రాలు, నిర్ణీత ప్రొఫార్మాలతో తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
News February 21, 2026
మదనపల్లె మృగాడు మృతి.. CM ఏమన్నారంటే?

AP: మదనపల్లె హత్యాచార నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై CM చంద్రబాబు వినుకొండ సభలో స్పందించారు. ‘మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంగా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికొస్తే అది వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించా. చట్టం కఠినంగా వ్యవహరిస్తుందన్న భయంతో అతను ప్రాణాలు తీసుకున్నాడు’ అని చెప్పారు. ఘటన అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబీకులు ముందుకు రాని విషయం తెలిసిందే.


