News September 8, 2024
జాతీయ రహదారిపై కారులో మంటలు

చిట్యాల పట్టణ శివారులో గల పెట్రోల్ పంపు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మంటలను గుర్తించి వెంటనే కారును పక్కకు ఆపడంతో ఇద్దరికీ ప్రాణాపాయ తప్పింది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
Similar News
News December 26, 2025
NLG: నక్సల్ ఉద్యమంలోకి వెళ్ళింది అప్పుడే..!

పాక చంద్రయ్య, పాపమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో హనుమంతు (గణేష్) మొదటివారు. ఆయన 1960లో జన్మించారు. హనుమంతుకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అందరికంటే పెద్దవాడైన హనుమంతు నల్గొండలో డిగ్రీ చేస్తూ రాడికల్ యూనియన్‌లో పనిచేశారు. 45 ఏళ్ల క్రితం ఏచూరి శ్రీనివాస్ అనే ఏబీవీపీ నాయకుని హత్యలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన నక్సలైట్ ఉద్యమంలో చేరారు.
News December 26, 2025
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ బదిలీ

మిర్యాలగూడ డివిజన్ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ బదిలీ అయ్యారు. ఆయనను నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. నారాయణ్ అమిత్ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.
News December 26, 2025
NLG: నేడు స్వగ్రామానికి హనుమంతు మృతదేహం

ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పాక హనుమంతు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఇవాళ ఉదయం వారు ఒడిశాకు వెళ్లారు. హనుమంతు తోబుట్టువులంతా గ్రామానికి చేరుకోనున్నారు. 1960లో జన్మించిన హనుమంతు గ్రామంలో 7వ తరగతి వరకు, చండూరులో 10వ తరగతి వరకు చదివారు. నల్గొండలో డిగ్రీ వరకు చదివారు.


