News October 15, 2025
‘జాతీయ రహదారి 167(ఏ) నిర్మాణం పూర్తి చేయాలి’

వాడరేవు-చిలకలూరిపేట జాతీయ రహదారి 167 (ఏ) నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం చెప్పారు. 47 కిలో మీటర్ల పొడవునా నిర్మించే రహదారి బాపట్ల జిల్లాలోనే 35 కిలోమీటర్ల పొడవున వెళ్తుందన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, తదితరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇప్పటివరకు 92.38% రహదారి నిర్మాణం పూర్తి చేసినట్లు వివరించారు.
Similar News
News October 15, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: INCకి వ్యతిరేకంగా 1500 నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ఎన్నికలో INCకి వ్యతిరేకంగా 1500 మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. 1000 మంది నిరుద్యోగులు, 300 మంది RRR భూ బాధితులు, 200 మంది మాల కులస్థులు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్‌ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిస్తేనే అధికార అహంకారం తగ్గుతుందని, అప్పుడే చిత్తశుద్ధితో పని చేస్తారని పోటీదారులు పేర్కొంటున్నారు.
News October 15, 2025
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ల్యాండ్ ఆక్విజిషన్‌పై సమీక్ష

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీ పనుల ల్యాండ్ ఆక్విజిషన్ పురోగతిపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, డీఆర్వో విజయ లక్ష్మి, ఆర్డీఓ నర్సంపేట ఉమారాణి, నేషనల్ హైవే పీడీ దివ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News October 15, 2025
నానాజీ తనయుడి రిసెప్షన్‌కు కలెక్టర్, ఎస్పీ

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు సందీప్ వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి స్థానిక లిటిల్ బర్డ్స్ స్కూల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. అతిథులుగా విచ్చేసిన వారికి ఎమ్మెల్యే నానాజీ కృతజ్ఞతలు తెలియజేశారు.