News January 22, 2025
‘జాతీయ రహదారులకు భూసేకరణ పూర్తి చేయండి’
రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూ సేకరణను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పాటు రెవెన్యూ, అటవీ, TR&B, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News January 22, 2025
నకిలీ హాల్ టికెట్‌తో అడ్డంగా దొరికిపోయాడు!
కర్నూలులో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో ఓ యువకుడు నకిలీ హాల్ టికెట్ సృష్టించి దొరికిపోయాడు. కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన తిరుమల ఛాతీ, ఎత్తు కొలతల్లో ఫెయిలయ్యాడు. అర్హుడైనట్లు నకిలీ హాల్ టికెట్ సృష్టించి 1,600M పరుగులో పాల్గొనేందుకు వచ్చాడు. ఇదివరకే ఫెయిలయిన వివరాలు కంప్యూటర్‌లో నమోదు కావడంతో అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
News January 22, 2025
ఎమ్మిగనూరు: వ్యక్తి మృతికి కారణమైన కుక్కలు
ఎమ్మిగనూరు మండలంలో కుక్కలు వ్యక్తి మృతికి కారణమయ్యాయి. సోగనూరు గ్రామానికి చెందిన నారాయణ (50) పొలం పనుల చేసి తిరిగి వస్తుండగా భీమిరెడ్డి పొలం వద్ద రెండు కుక్కలు ఆయన బైకుకు అడ్డు వచ్చాయి. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడింది. నారాయణ తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.
News January 22, 2025
రూ.6.91కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్: కర్నూలు కలెక్టర్
కర్నూలు జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్య తలెత్తకుండా రూ.6.91 కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు.