News September 23, 2025
జాతీయ రహదారుల భూసేకరణ పూర్తి చేయాలి: సీఎం

జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఎన్‌హెచ్ అధికారులు, రాష్ట్ర అధికారులు సమన్వయంతో రైతులను సంప్రదించి, వారికి తగిన పరిహారంపై భరోసా కల్పించాలని సూచించారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ఎన్‌హెచ్ 163జి పరిధిలోని 42 హెక్టార్ల భూసేకరణలో ఎక్కువ భాగం ఇప్పటికే పూర్తయిందని తెలిపారు.
Similar News
News September 23, 2025
పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

ఖమ్మం జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో కెమెరామెన్) పోస్టును ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదైనా డిగ్రీ అర్హత గల అభ్యర్థుల నుంచి ఈనెల 25లోగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. AP/TG స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్&ట్రైనింగ్ ద్వారా జారీ చేసిన సినీ ఫోటోగ్రఫీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
News September 23, 2025
ఆకేరు వాగులో రైతు గల్లంతు

తిరుమలాయపాలెం మండలంలోని పడమటి తండాకు చెందిన గుగులోతు రాములు (58) ఆకేరు వాగులో గల్లంతయ్యాడు. సోమవారం రాత్రి తన పొలంలో పని ముగించుకుని తిరిగి వస్తుండగా, ప్రమాదవశాత్తు వాగులో కాలు జారి పడి కొట్టుకుపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 23, 2025
ఖమ్మం: పాఠశాల వసతులపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్‌లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలలకు అవసరమైన వసతులు, సంక్షేమ వసతి గృహాల తనిఖీ, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార చర్యలపై సమీక్షించారు. కారుణ్య నియామకాలకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్ ఖాళీలను వారం రోజుల్లోగా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.