News December 21, 2025
జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసుల వివరాలు

జాతీయలోక్ అదాలత్‌లో మొత్తం 7,233 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తెలిపారు.
✓ కొత్తగూడెం: సివిల్ 28, క్రిమినల్ 3561, సైబర్ క్రైమ్ 230, రోడ్డు ప్రమాదాలు 16 మొత్తం-3990
✓ ఇల్లందు: సివిల్ 10, క్రిమినల్ 493, బ్యాంకు 111, మొత్తం-614
✓ భద్రాచలం: క్రిమినల్ 1298, బ్యాంకు 102, మొత్తం-1400
✓ మణుగూరు: క్రిమినల్ 1178, పీఎల్సీ 51, మొత్తం-1229 కేసులు పరిష్కారమయ్యాయి.
Similar News
News December 26, 2025
రాష్ట్రంలో తగ్గిన విదేశీ విద్యార్థులు

TG: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2012-13లో రాష్ట్రంలో 2,700 మంది విదేశీ విద్యార్థులు ఉండగా, 2021-22 నాటికి ఆ సంఖ్య 1,286కు చేరుకుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఫలితంగా దేశంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించే టాప్-10 రాష్ట్రాల లిస్టులో ప్లేస్ కోల్పోయింది. అటు ఏపీలో ఫారిన్ స్టూడెంట్ల సంఖ్య పెరిగింది. 2012-13లో 679గా ఉన్న సంఖ్య పదేళ్లలో 3,106కు చేరింది.
News December 26, 2025
TPT: 100 ఏళ్ల క్వాంటం కంప్యూటింగ్‌పై చర్చ

తిరుపతిలోని NSUలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సైన్స్ అండ్ టెక్నాలజీపై ఎక్స్ పో జరుగుతుంది. DRDO, CSIR, NIF, MPCST, NRSC, PFI, అటామిక్ ఎనర్జి, ఎర్త్ సైన్స్ తదితర రంగాల్లో 80పైగా ప్రదర్శనలు ఎక్స్ పోలో ఉన్నాయి. 100 ఏళ్ల క్వాంటమ్ కంప్యూటింగ్, పరిశోధనలు, AI& ML అప్లికేషన్లు తదితర అంశాలపై చర్చ జరగనుంది.
News December 26, 2025
నారదుడు ఎప్పుడూ ఎందుకు తిరుగుతుంటాడు?

నారద ముని ఒకచోట నిలకడగా ఉండలేరన్న విషయం మనకు తెలిసిందే. అయితే దీని వెనుక ఒక రహస్యం ఉంది. సృష్టి కార్యంలో భాగంగా దక్ష ప్రజాపతి కుమారులు సంసారంలో పడకుండా, నారదుడు వారికి వైరాగ్యాన్ని బోధించి సన్యాసులుగా మారుస్తాడు. దీనితో కోపించిన దక్షుడు, నారదుడు ఎక్కడా రెండు గడియల కంటే ఎక్కువ సేపు నిలబడకుండా ఉండేలా శాపం ఇస్తాడు. అది లోకకల్యాణానికి దారి తీసింది.


