News December 19, 2024
జాతీయ శాస్త్రవేత్తగా పాలమూరు బిడ్డ ఎంపిక

పాలమూరుకు చెందిన డా. కొత్తూరు గ్రీష్మా రెడ్డి ఐకార్ భారత వ్యవసాయ మండలి శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. కోయిలకొండ మం. వింజమూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, ప్రసన్న దంపతుల కూతురు గ్రీష్మారెడ్డి నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ పోటీ పరీక్షలో ప్రతిభ కనబరిచి ప్లాంట్ పాథాలజీ (మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రం) విభాగం శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. పరిశోధనలు చేసి అన్నదాతలని ఆదుకోవడమే లక్ష్యమని గ్రీష్మా అన్నారు.
Similar News
News January 1, 2026
MBNR: పార్టీకి ద్రోహంచేసేవారిని క్షమించను: ప్రెసిడెంట్

సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం మనందరి అదృష్టమని,పార్టీకి ద్రోహంచేసేవారిని క్షమించబోమని డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ వెల్లడించారు. భూత్పూర్‌లో నూతన సర్పంచుల సన్మాన ఆయన పాల్గొని మాట్లాడారు. సర్పంచులు, ఇతర సభ్యులు,స్వతంత్ర, ఇతర పార్టీల నుంచి కొత్తగా పార్టీలోకివచ్చే అందరూ సమిష్టిగాఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ, పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవాలని ఆయన కోరారు.
News January 1, 2026
MBNR:News Year..స్టాల్స్ ఏర్పాటుకు ఆహ్వానం

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ లోని స్థానిక మయూరి ఎకో పార్క్‌కు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున పార్క్ లో రుసుముతో కూడిన వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకున్న వారు స్థానిక పార్క్ లో సంప్రదించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 31, 2025
HYDపై పాలమూరు ఘన విజయం

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘T-20 కాకా స్మారక క్రికెట్ లీగ్’లో పాలమూరు జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 154/8 పరుగులు చేసింది. అనంతరం మహబూబ్ నగర్ జట్టు 17 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.MBNR జట్టుకు చెందిన క్రీడాకారులు అబ్దుల్ రపే-53* (4s-5,6s-1), డేవిడ్ కృపాల్ రాయ్-103* (4s-11,6s-6) పరుగులు చేశారు.ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్‌లు అభినందించారు.


