News January 25, 2026

జాతీయ ‘శిక్షా రత్న’ అవార్డులకు జిల్లా నుంచి ముగ్గురు

image

జాతీయ శిక్షా రత్న అవార్డుల్లో NZB జిల్లా ఉపాధ్యాయులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 150 మంది ఎంపికవగా మన జిల్లా నుంచి డా. ఈ. పోచన్న (పెర్కిట్), పి. రాజేశ్వర్ (ముప్కాల్), పి. శ్రావణ్ కుమార్ (నవీపేట) ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. టీఎల్ఎం ద్వారా సులభంగా బోధిస్తూ విద్యావ్యవస్థలో వారు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, అధికారులు వారికి అభినందనలు తెలిపారు.

Similar News

News February 17, 2026

NZB: ‘తప్పిదాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా మ్యాపింగ్ ప్రక్రియ’

image

తప్పిదాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా రోజువారీగా పర్యవేక్షణ చేయాలని CEO సుదర్శన్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఇతర అంశాలపై సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 17, 2026

NZB: ‘గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలి’

image

పల్లెల సర్వతోముఖాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తూ, మహిళా శక్తి సామర్థ్యాలను చాటాలని NZB జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. నిధులు, విధులను సక్రమంగా వినియోగిస్తూ, అందరి సమన్వయంతో గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత సర్పంచులపై ఉందని సూచించారు.

News February 17, 2026

NZB: 21 ఏళ్ల తరువాత కాంగ్రెస్‌కు మేయర్ పీఠం

image

21 ఏళ్ల తరువాత నిజామాబాద్ నగరపాలక మేయర్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. కార్పొరేషన్‌గా మారిన తరువాత 2006లో జరిగిన తొలి ఎన్నికల్లో ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. 2014, 2020లో జరిగి ఎన్నికల్లో BRS అభ్యర్థులు ఆకుల సుజాత, దండు నీతూ కిరణ్ మేయర్ పదవిని వరుసగా దక్కించుకున్నారు. 21 ఏళ్ల తర్వాత.. కాంగ్రెస్ తరఫున కూరగాయల ఉమారాణి మేయర్ అయ్యారు.