News March 11, 2025

జాతీయ స్థాయిలో జిల్లా పేరును మార్మోగించిన అరుణ

image

మాస్టర్స్ అథ్లెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన నేషనల్ లెవెల్ క్రీడల్లో గూడూరు పాఠశాల ఉపాధ్యాయిని మత్తి అరుణ తన అసామాన్య ప్రతిభను చాటారు. బెంగళూరులో జరిగిన ఈ పోటీల్లో 4×400 మీటర్స్ రన్నింగ్‌లో మొదటి స్థానంలో గోల్డ్ మెడల్‌, 4×100 మీటర్స్ రన్నింగ్‌లో సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పేరు జాతీయ స్థాయిలో మార్మోగేలా చేశారని తోటి ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.

Similar News

News March 11, 2025

అవనిగడ్డ: రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించిన కలెక్టర్

image

అవనిగడ్డ గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంక్‌ను శుభ్రపరచడం, క్లోరినేషన్ చేసిన తేదీలను సంబంధిత రిజిస్టర్‌లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా క్రమం తప్పకుండా ట్యాంక్‌ను శుభ్రపరిచి ప్రజలకు మంచినీటిని అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి సూచించారు.

News March 11, 2025

నాగాయలంక: పనులను పునః ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే  

image

నాగాయలంకలోని జలక్రీడల శిక్షణ కేంద్ర నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌లు శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను పునః ప్రారంభించారు. సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. జలక్రీడలపై నాగాయలంక అనువైన ప్రదేశమన్నారు. జాతీయ స్థాయి క్రీడాకారిణి నాగిడి గాయత్రి ఈ ప్రాంతం వాసి కావటంతో భవిష్యత్తులో నాగాయలంకకు దేశంలోనే గొప్ప ప్రఖ్యాతులు రానున్నాయని ఆశించారు. 

News March 11, 2025

కృష్ణా: మత్స్య సంపద యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు 

image

జిల్లాలో మత్స్య సంపద యూనిట్లు సజావుగా నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020-21 సంవత్సరంలో మొదలై 2023-24 సంవత్సరంతో ముగుస్తోందన్నారు. 

error: Content is protected !!