News January 7, 2026
జాతీయ స్థాయి ఖేల్ ఇండియా సెపక్ తక్రా పోటీలకు కోనసీమ క్రీడాకారులు

ఈ నెల 8 నుంచి 12 వరకు గుజరాత్‌లోని డామన్ డ్యూ ప్రాంతంలో 2వ ఆల్ ఇండియా ఖేలో బీచ్ సెపక్ తక్రా క్రీడా పోటీలు నిర్వహించానున్నారు. ఈ పోటీలకు కోనసీమ జిల్లాకు చెందిన క్రీడాకారులు కోసూరి ప్రసాద్, చొల్లంగి మోహన్ కృష్ణ ఎంపికైనట్లు జిల్లా సెపక్ తక్రా క్రీడా సంఘం అధ్యక్షుడు జవ్వాది తాతా బాబు, కార్యదర్శి సాయి దుర్గా ప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ క్రీడాకారులు గతంలో జాతీయస్థాయిలో పోటీల్లో బహుమతులు సాధించారన్నారు.
Similar News
News February 20, 2026
నత్తల నివారణకు విషపు ఎరను ఎలా తయారు చేయాలి?

ఈ నత్తలను విషపు ఎరను కూడా వాడి నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు. దీనికి 25 కిలోల తవుడు, 3 కిలోల బెల్లం, థయోడికార్బ్ 100 గ్రాములు, ఆముదం నూనె 100ML కలిపి చిన్న ఉండలుగా చేసి పొలాల్లో అక్కడక్కడా వేయాలి. వీటిని తిన్న నత్తలు మరణిస్తాయి. అంతేకాకుండా 1.5 లీటర్ల నీటిలో పొగాకు కాడెలను (50 గ్రా.) ఉడకబెట్టి చివరగా 60 గ్రా. కాపర్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసి నత్తలను నిర్మూలించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News February 20, 2026
ప్రకాశం: బీటెక్ విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో విషాదం నెలకొంది. మంగపతివారిపాలెం గ్రామానికి చెందిన మల్లెబోయిన శ్రీచరణ్ వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చాడు. గురువారం సాయంత్రం కాలేజీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. పొలాల్లో ఉన్న తండ్రికి ఈ విషయం చెప్పడానికి వెళ్లాడు. తిరిగి వస్తూ మధ్యలో ఈతకు దిగి మృతిచెందాడు.
News February 20, 2026
ఉదయం పూట ఖర్జూరాలు తింటే..

ఉదయం లేవగానే ఖర్జూరాలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఐరన్ వల్ల రక్తహీనత తగ్గుతుంది. గర్భిణులు, పిల్లలకు రెగ్యులర్‌గా ఇవ్వాలని, రాత్రిపూట నీళ్లు లేదా పాలలో నానబెట్టి ఉదయం తింటే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.


