News February 16, 2025
జాతీయ స్థాయి పోటీలకు ఏటూరునాగారం బిడ్డలు ఎంపిక

జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఏటూరునాగారానికి చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారని కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. గ్రామానికి చెందిన సాయిరాం, నరేంద్ర చారి, సంజయ్, రామయ్య, ప్రేమ్ సాగర్, అర్జున్ ఈ నెల 17 నుంచి 20 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కాగా క్రీడాకారులను స్థానికులు అభినందించారు.
Similar News
News November 24, 2025
తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.
News November 24, 2025
జనగామ: రేపు కలెక్టరేట్‌లో దిశా కమిటీ సమావేశం

జనగామ కలెక్టరేట్లో మంగళవారం దిశా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని వసంత తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కావున ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, దిశా కమిటీ మెంబర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
News November 24, 2025
తిరుపతిలో మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు

తిరుపతి నగరంలోని తిలక్ రోడ్డులో ఉదయాన్నే మద్యం విక్రయిస్తున్నారు. ఇదే విషయమై Way2Newsలో ఆదివారం <<18364526>>‘పొద్దుపొద్దున్నే.. ఇచ్చట మద్యం అమ్మబడును..?’ <<>>అంటూ వార్త ప్రచురితమైంది. ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించారు. వైన్ షాప్ పక్కనే మద్యం విక్రయిస్తున్న సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 6మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎక్సైజ్ సీఐ రామచంద్ర వెల్లడించారు.


