News October 3, 2024

జాతీయ స్థాయి పోటీలకు కర్నూలు విద్యార్థి

image

కరాటేలో కర్నూలు జిల్లా యువకుడు బద్రీనాథ్ రెడ్డి సత్తా చాటుతున్నారు. కర్నూలు టౌన్ మోడల్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి బద్రీనాథ్ రెడ్డి అండర్-19 విభాగంలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ సుంకన్న వెల్లడించారు. ఇటీవల రాజంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో తన ప్రతిభతో ఆకట్టుకున్నారని తెలిపారు. విద్యార్థిని కళాశాల సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు.

Similar News

News October 3, 2024

శ్రీగిరిలో నేటి నుంచి దసరా ఉత్సవాలు

image

శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబాదేవి అమ్మవారు దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు మినహా మిగిలిన ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. వాహనసేవలను సామాన్య భక్తులు వీక్షించేలా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. వాహన సేవలు, గ్రామోత్సవం, తెప్పోత్సవాలను భక్తులు <>శ్రీశైలటీవీ<<>> ద్వారా లైవ్ చూడొచ్చు.

News October 3, 2024

నంద్యాల హత్య కేసులో ముద్దాయి అరెస్టు

image

నంద్యాల గుడిపాటిగడ్డ వీధిలో గత నెల 30న దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సాయి మనోహర్‌ను హత్య చేసిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. తన భార్యతో అక్రమ సంబంధం ఉందని మనోహర్‌తో దుర్గా ప్రసాద్ గొడవ పెట్టుకొని కత్తితో దాడి చేశాడన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మరణించాడన్నారు. పరారీలో ఉన్న దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.

News October 3, 2024

రెండో రోజు కొనసాగిన విశాఖ ఉక్కు రక్షణ రిలే దీక్షలు

image

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర కార్మిక సంఘాలు, వామపక్ష, ప్రజా సంఘాలు, రైతు సంఘాల రాష్ట్ర సమితి పిలుపు మేరకు కర్నూలు ధర్నా చౌక్‌లో రెండో రోజు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐయూటీసీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్ బాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ మాట్లాడారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.