News September 11, 2025

జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ పోటీలకు సిద్దిపేట బిడ్డ

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ (డెహ్రాడూన్)కు సిద్దిపేట బిడ్డ ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో జరిగిన స్టేట్ లెవెల్ సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో అంబటి రాజు గౌడ్ (AEO,అగ్రికల్చర్ డిపార్ట్మెంట్) మొదటి స్థానం పొంది బంగారు పతకం సాధించారు. ఫిబ్రవరి (2026) డెహ్రాడూన్‌లో జరిగే జాతీయ స్థాయి ఈవెంట్‌లో ఆయన పాల్గొననున్నారు.

Similar News

News September 11, 2025

ఎర్రగుడిపాడులో రైలులో నుంచి పడి యువకుడి మృతి

image

ఎర్రగుంట్ల – ఎర్రగుడిపాడు మధ్య రైలులో నుంచి కింద పడి అరవిందు (21) మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. యువకుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు.

News September 11, 2025

డయేరియా వల్ల మరణాలు సంభవించలేదు: కలెక్టర్

image

విజయవాడలో డయేరియా వ్యాధి కారణంగా ఎవరూ మరణించలేదని కలెక్టర్ లక్ష్మీశా స్పష్టం చేశారు. సాధారణ మరణాలను కూడా డయేరియా మరణాలుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. డయేరియాపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు ఇప్పటికే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నారు.

News September 11, 2025

ములుగు: ట్రైబల్ వర్సిటీకి భవన నిర్మాణం ఎప్పుడు..?

image

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు కేటాయించిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సొంత భవనం కరవైంది. వనదేవతలు సమ్మక్క, సారక్క పేరు పెట్టిన ఈ యూనివర్సిటీకి ములుగు శివారులో 330 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రం రూ.889 కోట్లు కేటాయించింది. కానీ, పనులు ఇంకా ప్రారంభం కాలేదు. జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేశారు. బీఏ-ఇంగ్లిష్, ఎకనామిక్స్ కోర్సులున్నాయి.