News September 14, 2025
జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలంలోని జానంపేటలో 51.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. బాలానగర్ 50.5, భూత్పూర్ 12.8, మహబూబ్ నగర్ గ్రామీణం 12.3, దేవరకద్ర 11.8, రాజాపూర్ 7.8, నవాబుపేట 6.8, హన్వాడ 6.3, జడ్చర్ల 5.0 మిల్లీ మీటర్లు వర్షం పడింది.
Similar News
News February 12, 2026
MBNR: ‘తెలంగాణ తరహా కర్ణాటకలో కులవృత్తులను పునరుద్ధరించాలి’

తెలంగాణ రాష్ట్రంలో ఉండే కులవృత్తుల మాదిరిగా కర్ణాటక రాష్ట్రంలో కూడా కులవృత్తులను పునరుద్ధరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రణవ నంద స్వామి పాదయాత్ర ప్రారంభించి 700 కిలోమీటర్లకు చేరగా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. కర్ణాటక విధాన సభలో నారాయణ గురు స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
News February 12, 2026
MBNR: గోల్డ్ మెడల్ సాధించిన శ్రీజ

APలోని తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సౌత్ జోన్ షూటింగ్ బాల్‌లో మహమ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన శ్రీజ అద్భుత ప్రదర్శన కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈనెల 7 నుంచి జరిగిన సౌత్ జోన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని యువతకు స్ఫూర్తిగా నిలిచారు. గోల్డ్ మెడల్ సాధించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు.
News February 11, 2026
మహబూబ్‌నగర్ జిల్లాలో 69.5% ఓటింగ్ నమోదు

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పురపాలికలు, 1 నగరపాలికలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69.05 ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దేవరకద్రలో 85.51 శాతం ఓటింగ్, భూత్పూర్‌లో 84.58 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అలాగే మహబూబ్‌నగర్ నగరపాలికలో 67.73% ఓటింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.


