News August 22, 2025

జానపదాల ఖిల్లా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా

image

జానపద కళలకు, పాటలకు, కళాకారులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కేంద్రంగా నిలిచిందనడంలో సందేహం లేదు. పల్లెల్లో ప్రతి మాటలోనూ, యాసలోనూ ఓ పాట వినిపిస్తుంది. అందుకే ఇక్కడి పాటలు, పల్లె పదాలు ప్రజల మనసులను సులభంగా ఆకట్టుకుంటాయి. జానపదాలతో పేరు ప్రఖ్యాతులు పొందిన వారిలో మధుప్రియ, మౌనిక, మాట్ల తిరుపతి, సుమన్, శిరీష, గడ్డం రమేష్, దిలీప్, శ్రీనిధి వంటి ప్రముఖ కళాకారులు ఉన్నారు.
# నేడు ప్రపంచ జానపద దినోత్సవం

Similar News

News August 22, 2025

విజయవాడ రైల్వే డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి: MP

image

విజయవాడ రైల్వే డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు MP కేశినేని శివనాథ్ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌లో జీఎం సంజయ్‌కుమార్‌ను కలిసి లెవల్ క్రాసింగ్ నం. 316, 147, 148, 8 వద్ద తక్షణం ROBs, RUBs నిర్మాణానికి టెండర్లు పిలవాలని కోరారు. అలాగే గేట్‌వే ఆఫ్ అమరావతిగా పేరుగాంచిన కొండపల్లి స్టేషన్‌ను అమృత్ భారత్ 2.0 కింద ఆధునీకరించాలని విజ్ఞప్తి చేశారు. జీఎం సానుకూలంగా స్పందించారు.

News August 22, 2025

ప్రకాశం: ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

సెప్టెంబర్ 5న జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, హెచ్‌యంలు తమ పరిధిలోని ఎంఈఓలకు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. డిప్యూటీ DEOలు 25లోగా వాటిని పరిశీలించి 27న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News August 22, 2025

కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు ఎస్పీ కీలక సూచనలు

image

సివిల్, APSP కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈనెల 25, 26వ తేదీలలో కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్‌తో జతపర్చిన అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్ సర్టిఫికెట్స్, Annexure-I (Revised Attestation Form) గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 4 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తీసుకుని రావాలన్నారు.