News January 23, 2025
జాన్ పహాడ్ దర్గా ఉర్సుకు పటిష్ఠ భద్రత: SP

పాలకీడు మండలం జాన్ పహాడ్‌లో దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ దర్గాను పరిశీలించారు. ఉర్సుకు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సీఐ చరమంద రాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 17, 2025
ఇలా అయితే.. సిటీ మూసీలోకే: రఘునందన్‌రావు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని పేర్కొన్నారు. కన్నీళ్లతో ఒకరు ప్రచారానికి వస్తే.. కట్టెలు తీసుకొని ఇంకొకరు వస్తున్నారన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు వచ్చినా సిటీ మూసీలో కలవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.
News October 17, 2025
జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 38,000 క్యూసెక్కులు

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. శుక్రవారం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 38,000 క్యూసెక్కులు వస్తోంది. ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. విద్యుత్ ఉత్పత్తికి 34,592 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 750, భీమా లిఫ్ట్-1 కు 650, లిఫ్ట్ -2 కు 750, ఎడమ కాల్వకు1,030, కుడి కాలువకు 680 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం ప్రాజెక్టు నుంచి 37,773 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
News October 17, 2025
HYD: ECకి నేరచరిత్ర చెప్పని అభ్యర్థులు

ఎన్నికల సమయంలో కచ్చితంగా నేర చరిత్ర ఎన్నికల సంఘానికి చెప్పాలి.. అయితే ఇప్పటి వరకు కొందరు అభ్యర్థులు తమ నేరచరిత్రను చెప్పలేదు. లోక్‌సభ ఎన్నికల్లో HYD నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఏడుగురికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం నలుగురు మాత్రమే వివరాలు సబ్మిట్ చేశారు. ఇక చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో ఏడుగురికి నేరచరిత్ర ఉంటే ముగ్గురే వివరాలు అందించారు.