News January 23, 2025
జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్ సైదులు దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉర్సు ఉత్సవంలో మొదటి రోజు సంప్రదాయబద్ధంగా పూజారి ఇంటి నుంచి గంధం, ఫాయితా, పూలు, దట్టీలు తీసుకొని ముజావర్లు దర్గాకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ మేరకు భక్తులు తీసుకువచ్చిన పూలు, గంధం, స్వీట్లు, ఫలహారాలను బాబా సమాధుల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Similar News
News February 19, 2026
అశోక జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం

HNK అశోక జంక్షన్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. HNK బస్టాండ్ నుంచి చౌరస్తా వైపు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు వెనుక టైరు కింద ఓ వ్యక్తి పడిపోయాడు. ఈ ప్రమాదంలో సదురు వ్యక్తి నడుము భాగం పూర్తిగా విరిగిపోవడంతో పాటు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావమై స్పృహ కోల్పోవడంతో బాధితుడి వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
News February 19, 2026
పార్వతీపురం: ‘పరిపూర్ణమైన వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి’

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కేవలం పాస్ కావడమే ప్రధానం కాదని, వారు సమాజంలో నిలదొక్కుకునేలా పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాకుండా, వారి జీవనశైలిలో మార్పులు తీసుకురావాలన్నారు.జ
News February 19, 2026
తిరుపతి: ఈ పార్టీలో ఉంటూ మరో పార్టీలో సీటు కోసం..?

తిరుపతి జిల్లాకు చెందిన ఓ MLA తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కాకుండా మరో పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఉంటూనే తన కుటుంబంలో నుంచి ఓ వ్యక్తిని పక్క జిల్లా నుంచి మరో పార్టీలో పోటీ చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉండగానే ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఈ విషయం ఎప్పటికి బయటపడుతుందో వేచి చూడాలి.


