News September 3, 2025
జాన్ వెస్లీకి నివాళులర్పించిన ప్రకాశం ఎస్పీ

ఒంగోలులోని చర్చి కూడలి వద్ద గల జాన్ వెస్లీ ఐపీఎస్ విగ్రహానికి మంగళవారం జిల్లా ఎస్పీ దామోదర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. YSR భద్రతా అధికారిగా విధులు నిర్వహించిన జాన్ వెస్లీ హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్సార్‌తోపాటు ప్రాణాలు అర్పించి అమరులయ్యారు. ఈ నేపథ్యంలో జాన్ వెస్లీ 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఎస్పీ దామోదర్ నివాళులు అర్పించారు.
Similar News
News September 3, 2025
ప్రకాశం జిల్లా AR SPగా శ్రీనివాసరావు బాధ్యతలు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ దామోదర్‌ను ఏఆర్ విభాగం ఏఎస్పీ శ్రీనివాసరావు మర్యాదపూర్వంగా కలిశారు. ఏఆర్ ఏఎస్పీగా నియమితులైన శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్‌కు మొక్కను అందించగా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News September 3, 2025
త్రిపురాంతకం సమీపంలో ప్రమాదం.. ఇద్దరి మృతి

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నసముద్రం మెట్ట వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోర్‌వీల్ వ్యాన్- బైక్ ఒకదానికొకటి ఢీకొని ఓ మహిళ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 3, 2025
ప్రకాశం జిల్లాలోని పరిశ్రమలకు గుడ్ న్యూస్..!

ప్రకాశం జిల్లాలోని వివిధ పరిశ్రమలకు చెందిన 149 క్లెయిములకుగాను రూ.3.25 కోట్ల రాయితీలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంజూరు చేశారు. బుధవారం ఆమె అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను గడువు వరకు వేచి ఉండకుండా త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు.