News February 2, 2026
జాబ్ క్యాలెండర్: ఖాళీ పోస్టులపై కసరత్తు

AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చి, దాని ప్రకారం పోస్టులు భర్తీ చేయడానికి GOVT శాఖల వారీ ఖాళీలపై కసరత్తు చేపట్టింది. రెవెన్యూలో 13,000, విద్యలో 7,000, వర్సిటీల్లో 3000 ఖాళీలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. PRలో 26,000, మున్సిపల్‌లో 26,800, అగ్రికల్చర్‌లో 3,000, స్కిల్ డెవలప్‌మెంట్‌లో 4,200 ఖాళీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇతర శాఖల వివరాలూ తెప్పిస్తున్నారు. కాగా 90,000 వరకు ఖాళీలుండొచ్చని అంచనా.
Similar News
News February 20, 2026
USతో ట్రేడ్ డీల్.. ఏప్రిల్ నుంచి అమల్లోకి: పీయూష్ గోయల్

IND-US ట్రేడ్ డీల్‌పై మార్చిలో సంతకాలు జరుగుతాయని, APR నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. FEB 23 నుంచి 25 వరకు 2 దేశాల అధికారులు వాషింగ్టన్‌లో సమావేశమై డీల్ తొలి దశకు ఆమోదం తెలుపుతారన్నారు. ఢిల్లీలో జరిగిన AI సమ్మిట్‌లో ఆయన US రాయబారి సెర్గియోతో సమావేశమయ్యారు. UK, ఒమన్‌తో డీల్స్ APR నుంచి, న్యూజిలాండ్‌తో ఒప్పందం SEPలో అమల్లోకి రావొచ్చని గోయల్ పేర్కొన్నారు.
News February 20, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in
News February 20, 2026
ఈ మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వద్దు

మన ఇళ్లు, పొలాల గట్ల దగ్గర పెంచుకోదగ్గ మొక్కల్లో అరటి, బొప్పాయి, జామ, నిమ్మ, ఉసిరి, మునగ, అవిసె, పందిరి చిక్కుడు, బచ్చలి, గుమ్మడి, కరివేపాకు, కుంకుడు మొదలైనవి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ మొక్కలను ఒకసారి నాటితే ఎక్కువకాలం ఫలాలనిస్తాయి. వీటి పెంపకానికి పెద్దగా ఖర్చు కానీ, యాజమాన్యం కానీ అవసరం ఉండదు. ఇవి తక్కువ విస్తీర్ణంలో పెరుగుతూ ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్నిస్తూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


