News August 4, 2025
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: గీతాంజలి శర్మ

అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 6వ తేదీన జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ కోరారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న విద్యార్థులు పాల్గొనవచ్చునని తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళా జరుగుతుందన్నారు.
Similar News
News September 4, 2025
కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానాలు లేవు

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానవాటికలు లేవని ఎస్సీ సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ మేరకు గుడివాడలో 15, మచిలీపట్నంలో 15, ఉయ్యూరులో 43 గ్రామాలకు మొత్తం 72.98 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా భూసేకరణ చీఫ్ కమిషనర్ (CCLA)కు అందజేసింది.
News September 3, 2025
కృష్ణా జిల్లా రైతులకు శుభవార్త

కృష్ణా జిల్లాలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా గుజరాత్ నుంచి వస్తుందని అధికారులు తెలిపారు. బుధవారం 1,200 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. పకడ్బందీగా యూరియా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. పాస్ బుక్ ఉన్న రైతులకు 25 కేజీల యూరియా సరఫరా చేయనున్నారు.