News March 10, 2026

జాబ్ హగ్గింగ్.. ఏంటిది?

image

కరోనా తర్వాత ‘క్వైట్ క్విట్టింగ్’, ‘కెరీర్ కుషనింగ్’ వంటి ట్రెండ్స్ చూశాం. ఇప్పుడు ‘జాబ్ హగ్గింగ్’ వంతు. అంటే.. ప్రస్తుత ఉద్యోగంలో సంతృప్తి లేకపోయినా, గ్రోత్ లేకపోయినా.. ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్స్ భయంతో ఉన్నా.. దాన్నే గట్టిగా పట్టుకొని ఉండటం. ఇది కంపెనీపై ప్రేమతో చేసేది కాదు. బయట పరిస్థితులు బాగోలేక భద్రత కోసం తీసుకుంటున్న కేర్. కొత్త రిస్క్ తీసుకోవడం కంటే వస్తున్న జీతాన్ని కాపాడుకోవడం అన్నమాట.

Similar News

News March 30, 2026

త్వరలో మరో 2,929 పోస్టుల భర్తీ: దామోదర

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 9,572 పోస్టులు భర్తీ చేశామని, మరో 7,267 ఉద్యోగాల నియామక ప్రక్రియ జరుగుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. త్వరలో వైద్య శాఖలో 2,929 పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని అసెంబ్లీలో చెప్పారు. పైసా ఖర్చు లేకుండా ప్రతి పౌరుడికీ వైద్యసేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కింద రెండేళ్లలో 9.5 లక్షల మందికి ఉచిత వైద్యం అందించినట్లు వివరించారు.

News March 30, 2026

నలభై తర్వాత ఇవి తీసుకోండి

image

మెనోపాజ్ తర్వాత మహిళలు బరువు పెరగడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలా కాకుండా ఉండాలంటే సబ్జా గింజలు, సిట్రస్ పండ్లు, కోడిగుడ్లు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సరైన పోషకాలు అందడం వల్ల శారీరక మార్పులను తట్టుకుని ఆరోగ్యంగా జీవించడం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. దీంతో పాటు నలభై దాటాక కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామంపై కూడా దృష్టి సారించాలని చెబుతున్నారు.

News March 30, 2026

పొద్దుతిరుగుడు, ఆముదం సాగుకు అనువైన నేలలు

image

పొద్దుతిరుగుడు: నీరు నిల్వ ఉండని తటస్థ భూములు అయిన ఎర్ర, చల్కా, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు ఈ పంటకు అనుకూలం. ఉదజని సూచిక 6.5 నుంచి 8.0 ఉన్న నేలలు ఈ పంటకు చాలా అనువైనవి.
ఆముదం: అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నీరు బాగా ఇంకే నేలలు అనుకూలం. నీరు నిల్వ ఉండే నల్ల రేగడి నేలలు, పల్లపు భూములు, మరియు ఉప్పు భూములు ఆముదం పంటకు అస్సలు పనికిరావు.