News January 14, 2026

జితేశ్ శర్మ ఆల్‌టైమ్ IPL టీమ్.. విరాట్ కోహ్లీకి నో ప్లేస్

image

RCB వికెట్‌కీపర్ జితేశ్ శర్మ తన ఆల్‌టైమ్ IPL టీమ్‌ను ప్రకటించారు. అయితే ఇందులో కోహ్లీకి చోటు ఇవ్వకపోవడం చర్చకు దారి తీసింది. 2025 సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ విజయంలో కోహ్లీ (657 పరుగులు) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. జితేశ్ తన జట్టుకు ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అదే విధంగా రోహిత్, గిల్‌క్రిస్ట్, సూర్యకుమార్, కల్లిస్, ABD, బుమ్రా, హేజిల్‌వుడ్, హార్దిక్, అక్షర్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.

Similar News

News February 21, 2026

రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ రెండో వివాహం చేసుకున్నారు. ఐర్లాండ్‌కు చెందిన ప్రేయసి సోఫీ షైన్‌తో ఇవాళ ఏడడుగులు వేశారు. ఈ జంటకు అభిమానులు, తోటి క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

News February 21, 2026

667 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>మహానది <<>>కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 667 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా(మైనింగ్, పాథాలజీ), డిగ్రీ(మైనింగ్ Engg., మైనింగ్ సర్వేయింగ్ Engg.), ఓవర్‌మెన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, సర్వే సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ, BA అర్హత గలవారు మార్చి 16 -ఏప్రిల్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: mahanadicoal.in

News February 21, 2026

ఆప్కోతో టీటీడీ ఒప్పందం.. భారీ ఆర్డర్

image

AP: ఆప్కో చరిత్రలోనే తొలిసారి TTD నుంచి ఆర్డర్ వచ్చింది. మొదటి విడతగా 3K కండువాలు, 5K దుశ్శాలువాలు, 90K కాటన్ అప్పర్‌లు, 75K కాటన్ బ్లౌజ్‌లు సరఫరా చేయాలని TTD కోరింది. వాటిపై ఓం నమో వేంకటేశాయ అని తెలుగు, సంస్కృతంలో ముద్రించాలని సూచించింది. ఈ ఆర్డర్ నేతన్నలకు వేంకన్న దీవెన వంటిదని మంత్రి సవిత పేర్కొన్నారు. వారికి 365 రోజుల పాటు ఉపాధి అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు పనిచేస్తున్నామన్నారు.