News January 29, 2025

జిన్నారం: చిరుత సంచారం..?

image

మరికల్ మండలంలోని జిన్నారం పరిసరాల్లో మంగళవారం అర్ధరాత్రి చిరుత సంచరించినట్లు స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో పొలాల్లో తిరుగుతుండగా చూసి భయపడినట్లు పేర్కొన్నారు. చిరుతదాడిలో 20కి పైగా కోళ్లు మృతి చెందాయి. ఈ విషయమై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. 

Similar News

News March 14, 2025

రాజమండ్రి: గోదావరి నదిలో దూకి దంపతుల ఆత్మహత్య

image

రాజమండ్రి వద్ద గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకినాడ నగరం తూరంగి డ్రైవర్స్ కాలనీకి చెందిన భార్యభర్తలు కాళ్ల వెంకట రమణ, వరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. స్థానిక మార్కండేయ స్వామి ఆలయం ఘాట్ వద్ద ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 14, 2025

కాళ్ల : బతుకుదెరువు కోసం వస్తే జీవితాలు ఛిద్రమయ్యాయి!

image

బతుకుదెరువు కోసం ప.గో జిల్లా కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామం నుంచి ఇద్దరు బొలెరో వాహనంలో వచ్చారు. రొయ్య పిల్లలు తీసుకొని చల్లపల్లి మీదుగా స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఘంటసాల (మ) జీలగలగండి వద్ద నిద్రమత్తులో డ్రైవర్ లారీని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాహనాల్లో చిక్కుకున్న మృతదేహాలు బయటికి తీయడానికి పోలీసులు శ్రమించారు.

News March 14, 2025

రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

image

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు

error: Content is protected !!