News October 3, 2025

జియాగూడ మేకల మండి ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్

image

జియాగూడ మేకల మండి ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అనుమతులు ఇచ్చింది. త్వరలోనే ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. సుమారుగా రోజు 6,000 మేకలను వధించే సామర్థ్యంతో నూతన భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. చెంగిచెర్లలోని కబేలాను కూడా ఆధునీకరించాలని అక్కడికి వెళుతున్న పలువురు వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Similar News

News October 4, 2025

భారత్‌లో తాలిబన్ మంత్రి పర్యటనకు లైన్ క్లియర్

image

అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్‌పై ట్రావెల్ బ్యాన్‌ను UNSC తాత్కాలికంగా ఎత్తేసింది. తాలిబన్ నేతలపై బ్యాన్ అమల్లో ఉండగా దౌత్యం, అత్యవసర అంశాల్లో మినహాయింపునిచ్చింది. దీంతో ఆయన ఈనెల 9-16 మధ్య భారత్‌లో పర్యటించేందుకు లైన్ క్లియరైంది. 2021లో అఫ్గానిస్థాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత భారత్‌లో తాలిబన్ నేత పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల దౌత్య సంబంధాలు, ట్రేడ్‌పై చర్చ జరిగే అవకాశముంది.

News October 4, 2025

గోనె సంచులను అందించేందుకు చర్యలు: జేసీ

image

మిల్లర్ల నుండి నాణ్యమైన గోనె సంచులను సేకరించి రైతులకు అందించేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని జేసి రాహుల్ అన్నారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్ల మండలాల వారీగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, వివాదాలకు తావు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జేసి అన్నారు.

News October 4, 2025

విశాఖ అభివృద్ధికి వైసీపీ అడ్డంకి: గంటా

image

రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రూ.55 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్‌ను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తమ బినామీల భూములను కాపాడుకునేందుకే రైతుల పేరుతో కోర్టులో కేసులు వేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.