News December 28, 2025
జియో, NSE, ఓయో.. 2026లో IPOల జాతర

2025లో IPOల జోరు తర్వాత 2026లో ఏకంగా రూ.1 లక్ష కోట్ల సందడి మొదలుకానుంది. దలాల్ స్ట్రీట్‌లోకి దిగ్గజ కంపెనీలు లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. అందరూ ఎదురుచూస్తున్న జియో, NSE, ఫోన్‌పే IPOలు వచ్చే ఏడాదే వచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్, జెప్టో, ఓయో, బోట్ వంటి బడా కంపెనీలు కూడా లిస్టింగ్ రేసులో ఉన్నాయి. SBI MF, ఫ్రాక్టల్ అనలిటిక్స్ వంటి సంస్థలు కూడా ఇన్వెస్టర్లను ఊరించనున్నాయి.
Similar News
News December 31, 2025
మార్టిన్‌కి సోకిన మెనింజైటిస్ వ్యాధి ఇదే!

AUS మాజీ క్రికెటర్ డామీన్ <<18720461>>మార్టిన్<<>> మెనింజైటిస్ వ్యాధి కారణంగా కోమాలోకి వెళ్లారు. మెదడు- వెన్నెముకను కప్పి ఉంచే రక్షణ పొరలకు సోకే ప్రమాదకరమైన ఇన్ఫెక్షనే మెనింజైటిస్. ఇది మెదడును దెబ్బతీస్తుంది. వ్యాధి సోకినవారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించి యాంటీబయాటిక్స్ తీసుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
News December 31, 2025
జగన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మీరే కదా: ఉత్తమ్

TG: గత BRS ప్రభుత్వం పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. ‘జగన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మీరే కదా. రోజా ఇంటికి వెళ్లి KCR ఏం మాట్లాడారో గుర్తు లేదా? నీళ్లను AP వాడుకుంటే తప్పేముందని అనలేదా?’ అని ప్రశ్నించారు. హరీశ్ రావు తెలివి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నీళ్ల విషయంలో చరిత్ర సృష్టిస్తామని, రాష్ట్ర ముఖచిత్రం మారుస్తామని స్పష్టం చేశారు.
News December 31, 2025
పడక గదిలో పదునైన వస్తువులు ఉండకూడదా?

కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను బెడ్ రూమ్‌లో ఉంచకూడదని వాస్తు, జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కలహాలు పెరుగుతాయని అంటున్నారు. ‘మానసిక ఒత్తిడిని కలిగించి నిద్రలేమి సమస్యలకు దారితీస్తాయి. వీటిని ఎప్పుడూ బహిరంగంగా ఉంచకూడదు. వంట గదిలోనే ఎవరూ చేయి పెట్టని ప్రదేశంలో ఉండటం శ్రేయస్కరం. పడక గదిలో వీటిని నివారిస్తే.. అశాంతి దూరమవుతుంది’ అంటున్నారు.


