News March 17, 2025

జియ్యమ్మవలసలో ఏనుగులు గుంపు సంచారం

image

జియ్యమ్మవలస మండలం నందివాని వలస, తోటపల్లి, సింగాణపురం గౌరీపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి చెరకు, అరటి తోటల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయవద్దని, రైతులు పొలాలకు వెళ్లొద్దని సూచించారు. 

Similar News

News March 17, 2025

విషాదం: అమెరికాలో ముగ్గురు తెలంగాణవాసుల మ‌ృతి

image

TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ముగ్గురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. టేకులపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి(35), మనవడు హార్వీన్(6), ప్రగతి రెడ్డి అత్త సునీత(56)గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కన్నుమూయడం టేకులపల్లిలో విషాదాన్ని నింపింది.

News March 17, 2025

మాకవరపాలెం: బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

image

మాకవరపాలెం మండలం చామంతిపురంలో ఒక యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన దుంగల దుర్గాప్రసాద్(17) ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేశారు.

News March 17, 2025

కామారెడ్డి: భార్యని చంపిన భర్త

image

అనుమానంతో భార్యని చంపాడో భర్త. ఈ ఘటన HYDలోని అంబర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. కామారెడ్డి (D) దోమకొండ (M) అంబర్‌పేటకు చెందిన నవీన్‌కు బీబీపేట్(M)కు చెందిన రేఖ(27)తో పెళ్లైంది. వీరు HYDలో అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన నవీన్‌ భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈనెల 10న పెట్రోల్ పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రేఖ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

error: Content is protected !!