News January 1, 2025
జియ్యమ్మవలస: RPF కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అనంత నాయుడు అనుమానాస్పద రీతిలో మంగళవారం మృతి చెందారు. నల్గొండలో అక్కడి రైలు పట్టాలపై మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నాయుడు మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 14, 2025
రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఈ నెల 15న సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
News September 14, 2025
17న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు

ఈనెల 17న రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జిల్లా బంద్ చేపడతామని కార్మిక సంఘ నాయకులు తెలిపారు. శనివారం చీపురుపల్లిలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఫ్రీ బస్సుతో రోడ్డున పడ్డ ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.25 వేలు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీవో వేధింపులు, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదం, రాజాం డ్రైవర్లు పాల్గొన్నారు.
News September 14, 2025
VZM: ‘గాలికుంటు వ్యాధిని నిరోధించండి’

విజయనగరం జిల్లాలో గాలికుంటు వ్యాధిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించే గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను తన చాంబర్లో శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా నెలరోజులపాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పశువులకు వేయడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చన్నారు.