News March 25, 2024

జిరాఫీ మృతిపై విశాఖ జూ క్యూరేటర్ వివరణ

image

విశాఖ జూలో 24వ తేదీ అర్ధరాత్రి బెకన్ అనే మగ <<12921248>>జిరాఫీ<<>> మృతి చెందడంపై క్యూరేటర్ నందిని సలారియ వివరణ ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్ కారణంగా జిరాఫీ మృతి చెందిందన్నారు. సంవత్సర కాలంగా జిరాఫీకి చికిత్స అందిస్తున్నామన్నారు. చికిత్స కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైల్డ్ లైఫ్ వెటర్నరీ వైద్యులను నిపుణులను సంప్రదించినా లాభంలేకపోయిందన్నారు.

Similar News

News February 24, 2026

విశాఖ: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి టోకరా.. నిందితుడు అరెస్టు

image

నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి‌కి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 24, 2026

వీఆర్‌ఎస్-3లో ఉక్కు యాజమాన్యం వెనుకడుగు..?

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వీఆర్‌ఎస్-3 విషయంలో యాజమాన్యం వెనక్కి తగ్గినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడో విడతకు 700 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 67 మందికే ఆమోదం ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీఆర్‌ఎస్-1లో 1,126 మందికి, వీఆర్‌ఎస్-2లో 464 మందికి ఆమోదం లభించడంతో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. ఉత్పత్తిపై ప్రభావం పడుతోందనే వీఆర్‌ఎస్‌కు పరిమిత సంఖ్యలో యాజమాన్యం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

News February 24, 2026

కల్తీ పాలు తాగిన బాలుడు కేజీహెచ్‌లో మృతి

image

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వెంకట్(7) మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. కేజీహెచ్ సూపరిండెంట్ ఐ.వాణి మాట్లాడుతూ.. 18వ తేదీన కాకినాడ నుంచి ఈ బాలుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌లో జాయిన్ చేశారన్నారు. వచ్చేటప్పటికే రెండు కిడ్నీలు పాడయ్యాయని, ఇప్పటి వరకు 60 సార్లు డయాలసిస్ చేశామని, అయినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదని ఆమె Way2Newsకు వివరించారు.