News February 25, 2025
జిల్లాకు చేరుకున్న ప్రశ్న పత్రాలు

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయి. రాష్ట్ర విద్యాశాఖ నుంచి ప్రత్యేక వాహనంలో పకడ్బందీ బందోబస్తు నడుము ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రానికి పంపారు. వీటిని కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి
Similar News
News February 25, 2025
ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ముఖ్రా(కె) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి పర్యావరణ పరిరక్షణకు కొత్తబాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్ కోడ్‌లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామని బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదికగా పోస్టు చేసి ఆమెను అభినందించారు.
News February 25, 2025
6 నెలల్లో 4000 కి.మీ రోడ్లు వేశాం: పవన్

AP: NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 4వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 1800 కి.మీ సీసీ రోడ్లు మాత్రమే వేసిందని విమర్శించారు. తమ పాలనలో 22వేలకు పైగా గోకులాలు నిర్మించామని, ఒకేరోజు 13,326 గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఓ మంత్రి 77 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని ఆరోపించారు.
News February 25, 2025
ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి పర్యావరణ పరిరక్షణకు కొత్తబాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్ కోడ్‌లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామని BRS మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదికగా పోస్టు చేసి ఆమెను అభినందించారు.