News March 28, 2025
జిల్లాకు విమానాశ్రం మంజూరు చేయండి: MP నగేశ్

ADB జిల్లాకు విమానాశ్రయాన్ని మంజూరు చేయాలని ఎంపీ నగేశ్ కోరారు. గురువారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి వ్యూహాత్మకమైన ప్రాంతమని, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాలకు కూడా ఎంతో ఉపయోగకరమన్నారు. అన్ని విధాలుగా సౌకర్యవంతమైన ప్రాంతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసి ప్రజల చిరకాల వాంఛ తీర్చాలని కోరారు.
Similar News
News November 4, 2025
ఆదిలాబాద్: ఈనెల 6 నుంచి జిన్నింగ్ మిల్లుల మూసివేతపై కలెక్టర్ సమీక్ష

రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లులు నవంబర్ 6 నుంచి నిరవధికంగా మూసివేయనున్నట్లు తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగ అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులు, మార్కెటింగ్, వ్యవసాయ, రవాణా, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
News November 4, 2025
ఆ వ్యర్థాలను సాధారణ చెత్తలో వేయొద్దు: ఆదిలాబాద్ కలెక్టర్

ఆసుపత్రులు, వెటర్నరీ హాస్పిటల్స్, పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే మానవ, రసాయన వ్యర్థాలను సాధారణ చెత్తలో వేయొద్దని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో బయో మెడికల్ వెస్ట్ మేనేజ్మెంట్ రూల్స్-2016 అమలుపై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ రాజు ఉన్నారు.
News November 4, 2025
చేవెళ్ల బస్సు ప్రమాదంపై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు దిగ్బ్రాంతి

చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణక్క ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద ఘటనా స్థలంలోని దృశ్యాలు ఎంతో బాధ కలిగించాయని, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.


