News August 11, 2025
జిల్లాగా ఏర్పడనున్న ఆదోని

ఆదోని ప్రజల చిరకాల కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా నుంచి పశ్చిమ ప్రాంతాన్ని విడదీసి ఆదోని కేంద్రంగా జిల్లా చేయాలంటూ ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన సమయంలో ఆందోళనలు చేసినా ఫలితం లేదు. కూటమి ప్రభుత్వం ఆదోని ప్రజల కల నెరవేర్చే దిశగా అడుగులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News August 13, 2025
బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి

ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో వేగంగా వెళ్తున్న బుల్లెట్ బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఆదోనికి చెందిన లక్ష్మన్న ఎమ్మిగనూరులో పెళ్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా బుధవారం వేకువజామున కోటేకల్-ఆరేకల్ గ్రామాల మధ్యలో ఉన్న కోళ్లఫారం దగ్గర బైక్ అదుపు తప్పింది. పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు.
News August 12, 2025
ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం: కలెక్టర్

స్వాతంత్ర్య స్ఫూర్తితో ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేద్దామని ప్రజలకు కలెక్టర్ రంజిత్ బాషా పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలులోని ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కర్నూలులో 1.1 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం శుభ పరిణామం అన్నారు.
News August 12, 2025
ముగిసిన కర్నూలు జిల్లాస్థాయి యోగా పోటీలు

కర్నూలు జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన కర్నూలు జిల్లాస్థాయి యోగా పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ మేరకు జిల్లా యోగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అవినాష్ శెట్టి, మునిస్వామి తెలిపారు. విజేతలకు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో యోగా సంఘం రాష్ట్ర ఛైర్మన్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని ఆయన సూచించారు.