News September 16, 2025

‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి’

image

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని నూతన కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర్ రెడ్డిని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనను మంత్రి ఏపీ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా వెనకబడి ఉన్న జిల్లాను రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Similar News

News September 16, 2025

SKLM: సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

రాష్ట్ర రాజధానిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నిర్వహించిన సమావేశంలో శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి పథకాలను సీఎం వివరిస్తూ, ఆయా జిల్లాలలో ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లాస్థాయి అధికారులు పనిచేయాలన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో కొన్నిటిని అమలు చేశామని తెలియజేశారు.

News September 16, 2025

సీఎం సమీక్షలో విజయనగరం జిల్లా నూతన రథసారథులు

image

రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నూతన కలెక్టర్ ఎస్.రామ సుందరరెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

News September 16, 2025

పెద్దపల్లి: ‘జర్నలిస్టు సాంబశివరావుపై కేసులు ఎత్తివేయాలి’

image

టీ న్యూస్ ఖమ్మం ప్రతినిధి సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళనకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. జర్నలిస్టులపై కేసులు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఉల్లంఘన అని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ ఖండించారు.