News December 15, 2025
జిల్లాను ఓటింగ్‌లో టాప్‌లో ఉంచాలి: కలెక్టర్

శత శాతం ఓటింగ్‌లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గత విడత ఎన్నికల్లో రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. మూడో విడత ఎన్నికల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News March 9, 2026
మెదక్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

మెదక్ జిల్లా న్యాయమూర్తి నీలిమను జిల్లా కోర్టు ఛాంబర్‌లో సోమవారం కలెక్టర్ ప్రతిమా సింగ్ కలిశారు. ఇటీవల మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్ రాగా మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలు చర్చించారు. జిల్లాలో కోర్టులు, కేసుల పరిష్కారం, ఇతర విషయాలపై ఇరువురు మాట్లాడారు. పాలనాపరమైన అంశాలలో సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
News March 8, 2026
తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గొప్పది: కేసీఆర్

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషులతో సమానంగా స్త్రీల భాగస్వామ్యం ఉందన్నారు. మానవ మనుగడను కొనసాగించే గొప్పబాధ్యతను అనేక కష్టాలను భరిస్తూ నిర్వర్తిస్తున్న మహిళ త్యాగశీలి అని కొనియాడారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
News March 8, 2026
మెదక్: 4 పురపాలికల ప్రథమ పౌరులు మహిళలే..!

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు మహిళలే ప్రథమ పౌరులుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. మెదక్‌లో కానుగు రాధిక, రామాయంపేటలో లావణ్య, తూప్రాన్‌లో రాజమణి, నర్సాపూర్‌లో లక్ష్మి మున్సిపల్ ఛైర్‌పర్సన్లుగా బాధ్యతలు చేపట్టారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో నలుగురు మహిళా నేతలే పాలనా పగ్గాలు చేపట్టడం విశేషం. తమదైన ముద్ర వేస్తూ పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


