News October 7, 2025
జిల్లాలోనే అధిక పరిపాలనా విభాగాలు పర్చూరులోనే..!

పర్చూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ప్రత్యేకస్థానం సంపాదించింది. సాధారణంగా నియోజకవర్గానికి ఒక్కో ఉన్నతాధికారి ఉండడం సాధారణం. కానీ పర్చూరులో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ నియోజకవర్గంలో 6 మండలాలు ఉండగా, వీటి పరిపాలనకు ఇద్దరు DSPలు, ముగ్గురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు RDOలు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దీంతో పర్చూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలోనే అత్యధిక పరిపాలన వ్యవస్థగా ఉందని ప్రజలు అంటున్నారు.
Similar News
News October 7, 2025
IPOకు లలితా జ్యువెలరీ

రూ.1700 కోట్ల సమీకరణ లక్ష్యంగా లలితా జ్యువెలరీ మార్ట్ PVT Ltd త్వరలో IPOకు రానుంది. ఇందులో ఫ్రెష్ ఈక్విటీ షేర్లతో రూ.1200 కోట్లు, ప్రమోటర్ కిరణ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.500 కోట్ల విలువైన షేర్స్ సెల్ చేయనుంది. పబ్లిక్ ఇష్యూ కోసం జూన్‌లోనే సెబీకి అప్లై చేయగా ఇటీవల గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ చెన్నై బేస్డ్ కంపెనీకి తమిళనాడులో 2 మాన్యూఫ్యాక్చర్ యూనిట్స్, సౌత్ సహా దేశంలో 56 బ్రాంచిలు ఉన్నాయి.
News October 7, 2025
KNR: హైకోర్టు తీర్పుపై ఆశావహుల్లో ఉత్కంఠ..!

SEC స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదల చేసింది. BCలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వ GOను సవాల్ చేస్తూ కొందరు హై, సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నిన్న సుప్రీం కోర్టులో రిజర్వేషన్లపై విచారణ జరిపేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. దీంతో ఉమ్మడి KNRలోని ఆశావహులు హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠతో చూస్తున్నారు.
News October 7, 2025
నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి పోస్టును బట్టి CA, MBA, PGDM, PGDBM, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175. వెబ్‌సైట్: https://www.nhb.org.in/